ఎండిపోయిన పంటలకు ఎకరాకు యాభై వేల పరిహారం ఇవ్వాలి: మంద పవన్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: సిద్దిపేట

సాగునీరు అందక ఎండిపోయిన ప్రతి వరి పంటకూ ఎకరాకు యాభై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పర్వేద, కూరేళ్ల గ్రామాల్ లో ఎండిపోయిన పొలాలను పరిశీలించిన ఆయన, అప్పులపాలై రైతన్నలు పడుతున్న వేదనను వివరించారు. ప్రత్యేక బృందాలతో నష్టాన్ని అంచనా వేసి హుస్నాబాద్ను కరువు ప్రాంతంగా ప్రకటించాలని ఆయన కోరారు.