ఉత్సాహంగా సాగిన మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా ఎంపికలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలోని బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడాంశాల్లో మండల స్థాయి ఎంపిక పోటీలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 150 మంది బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మనోజ్ కుమార్, సర్పంచ్ కోయ మధు, ప్రిన్సిపాల్ సుధాకర్ తదితరులు పాల్గొని విద్యార్థులకు క్రీడా ప్రాముఖ్యతను వివరించారు.