'మా ఫ్యామిలీకి మొదట నుంచీ వందల ఎకరాలు ఉన్నాయి': కేటీఆర్ ఫైర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తమ కుటుంబానికి ఎవరి ఆస్తులు లాక్కునే అవసరం లేదని, తమ ఫ్యామిలీకి మొదటి నుండి వందల ఎకరాల ఆస్తులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై ముఖ్యమంత్రి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.