అద్భుతమైన ఫీచర్లతో షావోమీ స్మార్ట్ బ్యాండ్ 11 లాంచ్

రిపోర్టర్: రమేష్ స్థలం: World

షావోమీ సరికొత్త స్మార్ట్ బ్యాండ్ 11ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. 1.72-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో ఇది వస్తోంది. హైపర్ ఓఎస్ 4పై పనిచేసే ఈ బ్యాండ్, ఏఐ ఆధారిత హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర సుమారు రూ. 4,065 నుండి ప్రారంభమవుతుంది. భారత్‌లో లభ్యతపై ఇంకా స్పష్టత లేదు.