కోవూరులో యూట్యూబర్ శ్రావణ్ అరెస్ట్, పోలీసులతో మాజీ మంత్రి వాగ్వాదం
రిపోర్టర్: అశోక్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా కోవూరులో కాంట్రాక్టర్‌ను బెదిరించి రూ.5 లక్షలు డిమాండ్ చేసిన యూట్యూబర్ శ్రావణ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అనుచరుడైన శ్రావణ్‌ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ, అనిల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తన అనుచరుడిపై కక్ష సాధింపులో భాగంగానే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.