అక్తర్ మాతృమూర్తి పార్థివ దేహానికి ఎమ్మెల్యే ఆరెకపూడి నివాళులు
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
హఫీజ్పేట్ డివిజన్ సీనియర్ నాయకులు శ్రీ అక్తర్ మాతృమూర్తి మరణవార్త తెలుసుకున్న గౌరవ పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే శ్రీ ఆరెకపూడి గాంధీ వెంటనే వారి నివాసానికి చేరుకున్నారు. ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.