ఆమనగల్ మున్సిపాలిటీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రాయన్ పల్లి తండాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సంపత్ కుమార్, జీపీవో శ్రవణ్, డీలర్ కవిత, కౌన్సిలర్ నేనావత్ లక్ష్మి తదితరులు పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.