లక్సెట్టిపేట జూనియర్ కళాశాలలో రేపటి నుంచి బ్రేక్ ఫాస్ట్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: లక్సెట్టిపేట

లక్సెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు సోమవారం నుంచి బ్రేక్ ఫాస్ట్ అందించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ్ రావు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

కళాశాలలోని 900 మంది విద్యార్థులతో పాటు 40 మంది సిబ్బందికి పౌష్టికాహారంతో కూడిన ఇడ్లీ, రాగి ఇడ్లీలను ఉదయం పూట అందించనున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై దృష్టి సారించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు.