విజయనగరం: అంగన్వాడీ కేంద్రాల్లో బరువు తరుగుతున్న గుడ్లు, నిలదీస్తున్న లబ్ధిదారులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయనగరం

చిన్నారులు మరియు గర్భిణులకు అందించే అంగన్వాడీ కేంద్రాల కోడి గుడ్లలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నట్లు విజయనగరం జిల్లాలో ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యాభై గ్రాములు ఉండాల్సిన గుడ్డు బరువు, కేవలం కిలో నుంచి పదకొండొందల గ్రాములు మాత్రమే వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుత్తేదారులు చిన్న గుడ్లను సరఫరా చేస్తూ మోసానికి పాల్పడుతున్నారని, పర్యవేక్షించాల్సిన సీడీపీవోలు మరియు సూపర్వైజర్లు పట్టించుకోవడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన గుడ్లను సరఫరా చేయాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.