చిన్నరావుపల్లిలో ఘనంగా నేడు స్వామివారి అన్నదాన కార్యక్రమం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎచ్చెర్ల
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులంతా ఈ వేడుకకు హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు కోరారు. అదేవిధంగా రాత్రి వేళ భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ వేడుకలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.