గ్యాస్ సబ్సిడీ కోసం ఆధార్ ఈకేవైసీ తప్పనిసరి
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
తెలంగాణలోని గ్యాస్ వినియోగదారులకు రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ కీలక సూచన చేసింది. వంట గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పొందాలంటే వినియోగదారులు తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ లేదా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేనిచో సబ్సిడీ నిలిచిపోతుందని, సందేహాల కోసం 1906 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని కోరింది.