యాజమాన్య పోర్టల్లో వయసు నిబంధనలపై వ్యక్తమవుతున్న తీవ్ర విమర్శలు
రిపోర్టర్: రమేష్
స్థలం: తెలంగాణ
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రిక్రూట్మెంట్ పోర్టల్లో అరవై ఏళ్లు దాటిన వారికి రిజిస్ట్రేషన్ నిరాకరిస్తున్నారంటూ లింక్ఇన్ వినియోగదారుడు మాట్ వీల్ ఆరోపించారు. భారత దేశాన్ని ఎంచుకున్నప్పుడు పుట్టిన తేదీని తప్పనిసరి చేసి దరఖాస్తును తిరస్కరిస్తున్నారని ఆయన తెలిపారు. అమెరికాను ఎంచుకుంటే ఈ నిబంధన ఉండటం లేదని, ఇది వయసు ఆధారిత వివక్ష కిందకు వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాలలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.