స్పీకర్‌పై వ్యాఖ్యల వివాదంపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై వ్యాఖ్యల వివాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పందించారు. అసెంబ్లీ గేటు వద్ద తనపై దాడి చేసి ప్యాంటు ఊడదీయడానికి ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తన వ్యాఖ్యలను స్పీకర్‌కు ఆపాదిస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ పదవి పోయినా ప్రజల కోసం పోరాటం ఆపేది లేదని తేల్చిచెప్పారు.