ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం: హరేకృష్ణ ఫౌండేషన్తో ప్రముఖ సంస్థల ఒప్పందాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: Telangana

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జున్నా సోలార్ సిస్టమ్స్ మరియు చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు హరేకృష్ణ ఫౌండేషన్తో ఒప్పందం చేసుకున్నట్లు తెలంగాణ సీఎంవో వెల్లడించింది. ఈ కార్యక్రమంలో హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో పాటు జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థల ముఖ్య అధికారులు పాల్గొని విద్యార్థుల సంక్షేమం కోసం ఈ కీలక భాగస్వామ్యంపై సంతకాలు చేశారు.