వైద్య విద్య కల నెరవేర్చుకునేందుకు దాతల సాయం కోరుతున్న దళిత విద్యార్థిని
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
సొంతంగా యూట్యూబ్ వీడియోల ద్వారా చదువుకొని, NEETలో 389 మార్కులతో పటాన్చెరు మహేశ్వర మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించింది వర్ధన్నపేటకు చెందిన కొండేటి అఖీరా. అడ్మిషన్ పొందడానికి సాయంత్రం లోపు కాలేజీ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితి సరిగాలేని కుటుంబం కావడం వల్ల అంతటి పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోలేక అఖీరా తల్లిదండ్రులు దాతల సాయం కోరుతున్నారు. చిన్న మొత్తంలోనైనా సహాయం అందించి ఒక పేద బిడ్డ డాక్టర్ కలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.