బఫర్ జోన్ బియ్యం టెండర్లలో జాప్యం: టెండర్దారుల ఆవేదన

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

బఫర్ జోన్ లో పేరుకుపోయిన దొడ్డు బియ్యం టెండర్ ప్రక్రియ ముగిసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల లిఫ్టింగ్ జరగడం లేదని టెండర్దారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కోట్ల రూపాయల కిరాయిల భారం తగ్గినప్పటికీ, ఇప్పటివరకు ఆర్వోలు జారీ చేయలేదని వారు వాపోయారు. డిఫాల్ట్ మిల్లర్ల అడ్డంకులను తొలగించి, వెంటనే బియ్యం లిఫ్ట్ చేసేలా సంబంధిత మంత్రి మరియు కమిషనర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని టెండర్దారులు కోరారు.