శ్రీ సిటిలో ఇసుజు మోటార్స్ ప్లాంట్‌కు పదేళ్లు: ఘనంగా వేడుకలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: శ్రీ సిటి
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటిలో ఉన్న ఇసుజు మోటార్స్ ఇండియా ప్లాంట్ పదేళ్ల ప్రస్థానాన్ని ఘనంగా పూర్తి చేసుకుందని యాజమాన్యం వెల్లడించింది. ఏప్రిల్ 2016లో ప్రారంభమైన ఈ అత్యాధునిక తయారీ కేంద్రం ద్వారా అనేక వాణిజ్య వాహనాలను ఉత్పత్తి చేస్తున్నామని, గత ఏడాది కాలంలో లాభాలు గణనీయంగా పెరిగాయని ఎండీ రాజేష్ మిట్టల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, జపాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.