తిరుమల భక్తులకు అలర్ట్: డిసెంబర్ శ్రీవారి సేవ కోటా విడుదల
రిపోర్టర్: రమేష్
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సమాచారం అందించింది. డిసెంబర్ నెలలో వైకుంఠ ద్వార దర్శనాలు మరియు సాధారణ సేవలందించే శ్రీవారి సేవకుల కోటాను అక్టోబర్ 28న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 11 గంటలకు వైకుంఠ ఏకాదశి సేవకులు, మధ్యాహ్నం 12 గంటలకు జనరల్, నవనీత, పరకామణి సేవ స్లాట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు.