ఎర్రగడ్డ తండాలో శారద గృహప్రవేశ వేడుకకు హాజరైన సర్పంచ్ అనసూర్య
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఎర్రగడ్డ తండాలో గుగులోతు శారద నూతన గృహప్రవేశ వేడుకకు సర్పంచ్ జర్పుల అనసూర్య శ్రీనివాస్ నాయక్ హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి వేడుకలో పాల్గొని నూతన వస్త్రాలు బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.