కాంగ్రెస్ను వీడిన నేతలందరూ పార్టీలోకి తిరిగిరావాలని డిప్యూటీ సీఎం భట్టి పిలుపు
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిన నేతలందరూ తిరిగి సొంత గూటికి చేరుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బహిరంగంగా పిలుపునిచ్చారు. ఒక కాన్క్లేవ్లో మాట్లాడిన ఆయన, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను విడిచిపెట్టిన నాయకులంతా మళ్లీ పార్టీలోకి వస్తే సంతోషిస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ తో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, పార్టీ బలోపేతం కోసం సీనియర్ నేతలు మళ్లీ ఒక్కతాటిపైకి రావాలని ఆయన ఆకాంక్షించారు.