మురసు తుపాను బీభత్సం: అమరావతి ప్రాంతంలో నీట మునిగిన పంటలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం అతలాకుతలమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కొండవీటి వాగుతో పాటు పలు వాగులు పొంగిపొర్లడంతో వందకు పైగా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్ లో పత్తి, మిర్చి, వరి పంటలు నీట మునిగి రైతులు భారీ నష్టాన్ని చవిచూశారని అధికారులు తెలిపారు. రాజధానిలో రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతున్నప్పటికీ ముందస్తు చర్యలు కొరవడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.