లిక్కర్ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరికి భారీ షాక్

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు సునీల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసిందని అధికారులు వెల్లడించారు. లిక్కర్ రవాణాలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై వారిద్దరిని ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేయగా, ప్రస్తుతం వారు చంచల్గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఇదే కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును కూడా త్వరలోనే ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉందని సమాచారం.