శరీరంలో ఎడమవైపు కండరాలు పట్టేయడానికి అసలు కారణాలు ఏమిటి
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
శరీరంలో ఎడమవైపు కండరాలు ఎక్కువగా పట్టేయడానికి గల కారణాలను యశోద హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లి వివరించారు. బరువైన వస్తువులు ఎత్తడం, తప్పుడు భంగిమలో కూర్చోవడం వల్ల మజిల్ స్ట్రెయిన్ వస్తుందని తెలిపారు. తరచుగా ఒకే వైపు బరువు మోయడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్య రాకుండా సరైన వ్యాయామాలు, జీవనశైలి మార్పులు పాటించాలని ఆయన సూచించారు.