స్వాతంత్ర్య సమరయోధుడు ఏటుకూరి కృష్ణమూర్తికి ఘన నివాళులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఏటుకూరి కృష్ణమూర్తి (104) మృతికి హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో పలువురు సీపీఐ అగ్రనేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచిన అనంతరం, జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో కుమారుడు శ్రీనివాస మూర్తి చేతుల మీదుగా అంత్యక్రియలు పూర్తి చేశారు. కృష్ణమూర్తి ఆశయాలను, ఉద్యమ స్ఫూర్తిని నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు.