శాంతిభద్రతల నడుమ వినాయక మండపాల నిర్వహణపై పోలీసుల హెచ్చరికలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మాడ్గుల
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాడ్గుల మండలంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, ఎస్ హెచ్ ఓ టీ వేణుగోపాల్ వినాయక మండపాలను సందర్శించి భద్రతా చర్యలపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యుత్ వైరింగ్ మరియు అగ్నిప్రమాదాల నివారణలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. నిమజ్జన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్ కి అనుమతి లేదని, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.