విశ్వకర్మల అభ్యున్నతికి తోడ్పాటు అవసరం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శ్రీ విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు పంతంగి మదనాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. విశ్వకర్మలు ఆర్థిక, రాజకీయ, సామాజికంగా వెనుకబడి ఉన్నారని, వృత్తిదారులకు రూ.2 లక్షల వరకు రుణాలు, 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్, కౌన్సిలర్ ఊడుగు జ్యోతి రమేష్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ పోలో శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.