విజయవాడలో రూ.3 వేలు దాటిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయవాడ

పండుగల సీజన్లో గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు పెంచినట్లు అధికారులు వెల్లడించారు. తాజా పెంపుతో విజయవాడలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,001.50కి చేరి తొలిసారిగా రూ.3 వేల మార్క్ను దాటింది. హైదరాబాద్లోనూ ఈ ధర రూ.3,065కు చేరింది. అయితే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.