ఒరాకిల్‌లో భారీ ఉద్యోగాల కోత, కలకలం సృష్టిస్తున్న మెయిల్స్

రిపోర్టర్: రమేష్ స్థలం: World

ప్రముఖ టెక్‌ దిగ్గజం ఒరాకిల్‌లో మరోసారి భారీగా ఉద్యోగాల కోత ప్రారంభమైంది. కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఉదయం ఆరు గంటల నుంచే 'టుడే ఈజ్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే' అంటూ ఉద్యోగులకు లేఆఫ్స్ మెయిల్స్ రావడంతో సిబ్బందిలో తీవ్ర కలకలం రేగింది. వ్యాపార అవసరాల ఆధారంగానే ఈ తొలగింపులు చేపట్టినట్లు కంపెనీ స్పష్టం చేసింది.