ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్సు ఘటన: వీడియో పోస్ట్ చేసిన ముగ్గురు యువకుల అరెస్ట్

రిపోర్టర్: వెంకట్ స్థలం: Telangana

తెలంగాణలోని ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్సులో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్వతంత్ర జర్నలిస్ట్ రేవతి ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మడుపు శ్రీకేశ్, మహమ్మద్ మొమిన్ పాషా, అరుణ్ గౌడ్ అనే ముగ్గురు యువకులను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారని ఆమె పేర్కొంటూ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. మహిళల భద్రతపై జరుగుతున్న పరిణామాలపై సర్వత్రా చర్చనీయాంశమైంది.