నీళ్లు అడిగితే బీఆర్ఎస్ నేతల అరెస్ట్ ఎందుకని మండిపాటు

రిపోర్టర్: విజయ్ స్థలం: Telangana

సాగునీరు ఇవ్వాలని కోరిన బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడంపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చేతకాని ప్రభుత్వమని విమర్శించారు. తాగునీటి అవసరాల పేరు చెప్పి పంటలను ఎండబెట్టవద్దని, జూరాలలో తాగునీటికి తొమ్మిది టీఎంసీలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.