హెచ్ఐవీపై అపోహలు వద్దు బాధితుల పట్ల వివక్ష చూపొద్దన్న జడ్జి పూజ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
వరంగల్ రంగంపేటలోని కరుణ మైత్రి సొసైటీలో నిర్వహించిన సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి కందుకూరి పూజ పాల్గొని మాట్లాడారు. హెచ్ఐవీపై ఎలాంటి అపోహలు నమ్మవద్దని, బాధితుల పట్ల ఎవరూ వివక్ష చూపకూడదని స్పష్టం చేశారు. వారి హక్కుల ఉల్లంఘన జరిగితే జిల్లా చట్టపరమైన సేవా అధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.