ఈసీ నిర్ణయంపై మల్లికార్జున ఖర్గే నిప్పులు: మోదీ సర్కార్ను గద్దె దించుతామని హెచ్చరిక
రిపోర్టర్: రాము
స్థలం: ఢిల్లీ
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి భారీ నిరసన సభలో ఆయన మాట్లాడుతూ, యువకులు, మహిళలు, దళితుల ఓట్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీరును ఆయన తప్పుపట్టారు. మోదీని గద్దె దించి, రాజ్యాంగాన్ని కాపాడే వరకు పోరాటం కొనసాగిస్తామని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.