కాకినాడలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమంటూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలన
రిపోర్టర్: మహేష్
స్థలం: కాకినాడ
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జనజీవనం స్తంభించింది. మోకాళ్ల లోతు వరద నీటిలోకి దిగి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిస్థితిని పరిశీలించారు. బాధితులకు ప్రభుత్వం భరోసా ఇస్తుందని ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.