ఏపీలో రెసిడెన్స్ సర్టిఫికెట్ల జారీపై కీలక నిబంధనలు తెచ్చిన ప్రభుత్వం

రిపోర్టర్: సునీల్ స్థలం: Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఊరటనిస్తూ రెసిడెన్స్ సర్టిఫికెట్ల జారీపై కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. సాధారణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవల కోసం ఇకపై ప్రత్యేకంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆధార్ లేదా రేషన్ కార్డులను అడ్రస్ ప్రూఫ్‌గా వాడుకోవచ్చని స్పష్టం చేసింది. తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పించేలా ఈ సర్టిఫికెట్ల జారీ అధికారాలను మళ్లీ తహసీల్దార్లకు అప్పగిస్తూ, కేవలం కేంద్ర విద్యా సంస్థలు, రక్షణ రంగ ఉద్యోగ నియామకాలు, గిరిజన కుటుంబాల ఆధార్ నమోదు వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇది తప్పనిసరి అని వెల్లడించింది.