పులివెందులలో దారుణం: పలు వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: పులివెందుల

వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సమీపంలోని ఉలిమెల గ్రామానికి చెందిన మధుసూదన్రెడ్డి నివాసం వద్ద నిలిపి ఉంచిన వాహనాలకు శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఎనిమిది వాహనాలు పూర్తిగా దగ్ధమైనట్లు స్థానికులు వెల్లడించారు. పురపాలిక ఎన్నికల పోలింగ్ కు ముందు రోజు జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.