సిరికొండలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఆయేషా ఫాతిమా ఎంపిక
రిపోర్టర్: ASIF reporter
స్థలం: నిజామాబాద్ రూరల్
నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం కిడ్స్ పార్క్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆయేషా ఫాతిమాకు మండల స్థాయి బెస్ట్ టీచర్ అవార్డు లభించింది. ఈ విషయాన్ని పాఠశాల కరస్పాండెంట్ ఫర్హీన్ ఉన్నిసా అధికారికంగా వెల్లడించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారిలోని సృజనాత్మకతను వెలికితీయడంలో ఆయేషా ఫాతిమా చేస్తున్న కృషిని యాజమాన్యం అభినందించింది. ఈ కార్యక్రమంలో శాహానాజ్ తదితరులు పాల్గొన్నారు.