కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
తెలంగాణలో కరువు పరిస్థితుల్లోనూ రైతాంగానికి అండగా కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించారని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తున్నామని స్పష్టం చేసింది. అయితే కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసి మేడిగడ్డలో పోయాలంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడింది. రాష్ట్ర పరిపాలనపై కాంగ్రెస్ నాయకులకు కనీస అవగాహన లేదని ఆ పార్టీ విమర్శించింది.