మహిళల భద్రతపై అహ్మదాబాద్లో ప్రయోగం: ఒంటరిగా తిరుగుతూ ఆశ్చర్యకర విషయాలు వెల్లడించిన యువతి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Ahmedabad

మహిళల భద్రతను పరిశీలించేందుకు అహ్మదాబాద్ నగరంలో రాత్రి సమయంలో ఒక కంటెంట్ క్రియేటర్ ప్రత్యేక ప్రయోగం నిర్వహించినట్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఎక్స్ ప్లోర్ విత్ స్నేహా వెల్లడించారు. నిర్మానుష్య రోడ్లపై ఒంటరిగా నడుస్తూ, ఆటోలో నిద్రపోతున్నట్లు నటించి పరీక్షించగా స్థానికులు, డ్రైవర్లు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా సహాయం చేశారని, నగరం మహిళలకు ఎంతో సురక్షితమని ఆమె కొనియాడారు.