గణనాథుల కొలువుదీరే వేళ ముస్తాబైన పల్లె మండపాలు

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి మండలం తోటపల్లి, ఎల్లికట్ట, వెంకటపూర్ గ్రామాలలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పండుగ సందర్భంగా వివిధ ఆకృతులతో యూత్ సభ్యులు ఆదివారం రాత్రి వినాయక మండపాలను సుందరంగా ముస్తాబు చేశారు. దీంతో ఆయా గ్రామాలలో భారీ గణనాథులు కొలువుదీరనున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే వేడుకల్లో భక్తులు తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించనున్నారు. అలాగే మహిళలు బతుకమ్మలతో సందడి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.