అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు నష్టం దావా కొట్టివేత
రిపోర్టర్: హరి
స్థలం: వాషింగ్టన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాల్‌స్ట్రీట్ జర్నల్ పై వేసిన పరువు నష్టం దావాలను యూఎస్ కోర్టు కొట్టివేసినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్ స్టీన్ కు ట్రంప్ పుట్టినరోజు లేఖ రాశారంటూ ప్రచురితమైన కథనంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే వాస్తవ దురుద్దేశాన్ని నిరూపించడంలో ట్రంప్ తరఫు న్యాయవాదులు విఫలమయ్యారని, పత్రిక పాటించిన జర్నలిజం ప్రమాణాలతో కోర్టు ఏకీభవించిందని న్యాయమూర్తి డారిన్ పి. గేల్స్ స్పష్టం చేశారు.