నూకసాని బాలాజీ జన్మదిన వేడుకలు.. తిరుపతిలో ఘనంగా శుభాకాంక్షలు తెలిపిన నేతలు
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ఇంచార్జ్ నూకసాని బాలాజీ పుట్టినరోజు వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర టూరిజం చైర్మన్‌ను రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి. నరసింహ యాదవ్ నేరుగా కలిసి పుష్గుచ్ఛం అందించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాలాజీకి శుభాకాంక్షలు తెలిపారు.