గాడితప్పిన వర్ధన్నపేట మున్సిపాలిటీ పాలనపై ప్రజల ఆక్రోశం

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట పురపాలక సంఘంలో పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో పట్టణ పాలన పూర్తిగా గాడితప్పింది. ఇన్చార్జులతో కాలం వెళ్లదీస్తుండటంతో రోజువారీ పనుల పర్యవేక్షణ కొరవడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వార్డుల్లో చెత్త పేరుకుపోయి, డ్రెయిన్లలో పూడిక తీయకపోవడంతో దోమల తీవ్రత పెరుగుతోంది. పలు వీధుల్లో లైట్లు వెలగక రాత్రివేళల్లో పట్టణవాసులు చీకట్లోనే సంచరిస్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో కార్యాలయ సిబ్బంది విధుల పట్ల అలసత్వం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.