గురజాడ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
విజయనగరం కంటోన్మెంట్లో మహాకవి గురజాడ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక శాఖ మరియు జిల్లా యంత్రాంగం సంయుక్తంగా చేపట్టిన ఈ వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని గురజాడ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాడ సామాజిక స్పృహను యువత, విద్యార్థులు ప్రతి ఒక్కరూ అలవరుచుకొని సమాజ పురోగతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.