అనంతపురం అభివృద్ధికి కేంద్ర నిధులు: మంత్రి తోఖాన్ సాహు హామీ
రిపోర్టర్: రాము
స్థలం: అనంతపురం
అనంతపురం నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తామని కేంద్ర మంత్రి తోఖాన్ సాహు వెల్లడించారు. నగరంలో కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం రోడ్‌షో నిర్వహించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో పాటు అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతం గోల్డెన్ ట్రయాంగిల్‌గా మారుతోందని పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో పాటు కార్పొరేషన్‌లోనూ కూటమిని గెలిపించి ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వంతో మరింత అభివృద్ధి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.