న్యూజిలాండ్ తో సిరీస్ కు విపరీతమైన క్రేజ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Zealand

ఆరేళ్ల తర్వాత టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమవుతుండటంతో క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. హోమ్ సమ్మర్ సీజన్ కోసం ఇప్పటికే 50,000లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో భాగంగా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు జరగనున్నాయి. అభిమానుల తాకిడిని బట్టి అక్లాండ్‌లో అదనపు సీటింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.