ప్రయాణికులకు తీపి కబురు: ఆర్టీసీలో కొత్తగా మూడు వేల బస్సులు

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆర్టీసి జేఎండీ శివప్రసాద్ వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఏడు వందల యాభై ఎలక్ట్రిక్ బస్సులు, వచ్చే ఏడాది మే నాటికి ఐదు వందల సీఎన్జీ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దశలవారీగా మరిన్ని కొనుగోలు చేసి రెండు వేల ఇరవై ఏడు నాటికి మొత్తం మూడు వేల కొత్త బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన స్పష్టం చేశారు.