అసెంబ్లీ గేటు వద్ద ఎమ్మెల్యేల అడ్డుకోలుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై తెలంగాణ హైకోర్టు హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ వ్యవహారాల్లో స్పీకర్‌కే పూర్తి అధికారాలుంటాయని, పోలీసులకు జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేసింది. మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశిస్తూ, విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.