రాంపూర్ తండా విద్యార్థులకు పోక్సో చట్టంపై కల్పించిన ప్రత్యేక అవగాహన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తుర్కపల్లి

తుర్కపల్లి మండలం రాంపూర్ తండాలోని మోడల్ స్కూల్లో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్చన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ అంబటి శోభారాణి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పోక్సో చట్టం, బాలల హక్కులు, న్యాయ సేవల పథకాలు మరియు బాల్య వివాహాల నిషేధం గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవసరమైన విషయాలను శ్రద్ధగా తెలుసుకున్నారు.