షాకింగ్ ఘటన: ప్రేమికుల ఆత్మహత్యను ఇన్స్టాగ్రామ్లో లైవ్ స్ట్రీమింగ్ చేసిన వైనం

రిపోర్టర్: హరి స్థలం: దాహోద్

గుజరాత్లోని దాహోద్ జిల్లాలో ప్రేమజంట దారుణంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనను వారు సోషల్ మీడియాలో నేరుగా లైవ్ స్ట్రీమింగ్ చేశారని రండిఖ్పూర్ పోలీస్ స్టేషన్ అధికారి శైలేష్ బరియా వెల్లడించారు. కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతోనే వారు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుమారు యాభై మందికి పైగా ఈ ఘోరాన్ని ప్రత్యక్షంగా వీక్షించినట్లు అధికారులు స్పష్టం చేశారు.