ఆత్మకూరులో రూ.53.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో సోమవారం అఖండ అభివృద్ధి జాతరకు సర్వం సిద్ధమైందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో రూ.53.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.